జగన్ సర్కార్ శుభవార్త.. వారికి జూన్ 4న అకౌంట్లోకి రూ.10 వేలు..!

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. మరోవైపు.. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత

జగన్ సర్కార్ శుభవార్త.. వారికి జూన్ 4న అకౌంట్లోకి రూ.10 వేలు..!

Vahanamitra scheme amount: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. మరోవైపు.. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ సారి వైఎస్సార్ వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 33 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది లబ్ది పొందిన 2 లక్షల మందితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు జూన్ 4న ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేలు జమచేయనున్నారు. ఇక కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు పరిశీలన జరిపి.. జూన్ 1న వాటికీ ఆమోదముద్ర వేయనున్నారు.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం.. 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu