జూన్ 8 నుంచి ఏపీలో ఆలయ దర్శనాలు.? నయా రూల్స్ ఇవే..!

జూన్ 8 నుంచి ఏపీలో ఆలయ దర్శనాలు.? నయా రూల్స్ ఇవే..!

అందరూ అనుకున్నట్లుగానే లాక్‌డౌన్‌ను మరో 30 రోజులు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాలలో జూన్ 8 నుంచి ప్రార్ధనా మందిరాలు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో.. వచ్చే నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేసిన TTD.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. భక్తులకు శ్రీవారి దర్శనాలు […]

Ravi Kiran

|

May 31, 2020 | 12:54 PM

అందరూ అనుకున్నట్లుగానే లాక్‌డౌన్‌ను మరో 30 రోజులు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాలలో జూన్ 8 నుంచి ప్రార్ధనా మందిరాలు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో.. వచ్చే నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేసిన TTD.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. భక్తులకు శ్రీవారి దర్శనాలు కల్పించేందుకు సిద్ధమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అటు శ్రీశైలం ఆలయాన్ని కూడా జూన్ 8 నుంచి తెరవనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. దర్శనానికి వచ్చే భక్తులు క్యూ పద్దతి పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని.. దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ సడలింపులలో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో ఏపీ దేవాదాయశాఖ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా ఎలాంటి నివారణా చర్యలు తీసుకోవాలన్న దానిపై పలు మార్గదర్శకాలను సిద్ధం చేసి వైద్య ఆరోగ్యశాఖ అనుమతి కోసం పంపినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి ఆమోదం పొందిన తర్వాత అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.

మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. 

  • గంటకు 300 మందికి మాత్రమే దర్శనానికి అనుమతించాలి.
  • స్థానిక పరిస్థితులు బట్టి ఆలయ దర్శనాల టైమింగ్స్‌ను కార్యనిర్వాహక అధికారులు నిర్ణయించాలి.
  • దర్శనానికి వచ్చే భక్తులు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి
  • నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర వాటికి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో కేవలం 30 శాతం మందినే అనుమతించాలి.
  • కాటేజీల్లోని 50 శాతం గదులను మాత్రమే భక్తులకు కేటాయించాలి.
  • కేశఖండన శాలలో క్షురకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • అన్నదానం ప్రసాదం, నిత్యాన్నప్రసాదం ఉండదు.
  • ఆలయాల్లో దుకాణాల్లో ఒకదాన్ని విడిచి మరొకటి తెరవాలి
  • ఆలయాల దగ్గర ఉండే పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతి ఉండదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu