AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై పోరులో ప్రతి వ్యక్తీ వారియరే’…. ‘మన్ కీ బాత్’ ప్రోగ్రామ్ లో పీఎం మోదీ

దేశానికి పెను సవాలుగా నిలిచిన కరోనా వైరస్ పై జరుపుతున్న పోరులో ప్రతి వ్యక్తీ వారియరే అన్నారు ప్రధాని మోదీ. ఈ పోరాటంలో 'భారత సేవా శక్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు..

కరోనాపై పోరులో ప్రతి వ్యక్తీ వారియరే'.... 'మన్ కీ బాత్' ప్రోగ్రామ్ లో పీఎం మోదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: May 31, 2020 | 12:43 PM

Share

దేశానికి పెను సవాలుగా నిలిచిన కరోనా వైరస్ పై జరుపుతున్న పోరులో ప్రతి వ్యక్తీ వారియరే అన్నారు ప్రధాని మోదీ. ఈ పోరాటంలో ‘భారత సేవా శక్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. అనేక అంశాలను స్పృశించారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశ జనాభా చాలా ఎక్కువని, అలాగే మనకు భారీ సవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. కానీ వేరే దేశాల మాదిరి ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందలేదని, ఇందుకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలేనన్నారు. అలాగే  ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు మన దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువని ఆయన పేర్కొన్నారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని, వారి దుస్థితి మాటల్లో చెప్పలేనిదని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఇబ్బంది పడని వర్గమంటూ లేదన్నారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి ‘మైగ్రేషన్ కమిషన్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసే యోచన ఉందని అయన ప్రకటించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. ఈ వలస జీవులను వారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే సిబ్బంది, ప్రభుత్వ సంస్థలు, కేంద్రంతో బాటు అన్ని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సైతం కృషి చేశాయని, వారికి ఆహారం , నీరు, వసతి సౌకర్యం సమకూర్చాయని పేర్కొన్న ఆయన..’ఈ వర్గాలనన్నింటినీ ‘కరోనా వారియర్స్’ గా అభివర్ణించారు.

రైళ్లు, బస్సులలో వీరిని తరలించేందుకు పాటు పడిన రాష్ట్రాలను ప్రత్యేకంగా అభినందించారు. వారిని క్వారంటైన్ చేయడం,  వారికి ట్రీట్ మెంట్ ఇప్పించడంవంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని, ఆరు అడుగుల దూరం పాటింపు, మాస్కుల ఆవశ్యకత ఇంకా ఉందని మోదీ పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ప్రతి వ్యక్తి సపోర్టుతో కరోనా వైరస్ ని మనం అదుపు చేయగలుగుతామని, ఆ విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు.

ఇక దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందని, అందువల్లే లాక్ డౌన్ 5.0 దశలో చాలా మినహాయింపులు ఇచ్చామని మోదీ వివరించారు.