రుయాలో కరోనా కలకలం..సిబ్బందికి పాజిటివ్
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ మరోమారు పడగ విప్పింది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో విధులు నిర్వహించే సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ మరోమారు పడగ విప్పింది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ స్టాఫ్ నర్సుకు, మరో సెక్యూరిటీగార్డుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రిలోని ఇతర నర్సులకు, సెక్యూరిటీగార్డులకు పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రోగుల కోసం మరింత పటిష్టంగా రక్షణ చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు పేర్కొన్నారు. మాస్కులేని రోగులను, వారి కుటుంబ సభ్యులను ఆస్పత్రిల్లోకి అనుమతించబోమని వివరించారు.
ఇదిలా ఉంటే, ఏపీలో బుధవారం కొత్తగా 351 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో రాష్ట్రానికి చెందిన వారు 275 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 76 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. బుధవారం మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కి చేరింది. 2906 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2559గా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 90కి పెరిగింది.