AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా విలయం.. ఒక్క రోజులోనే 3,722 కేసులు, 134 మరణాలు నమోదు..

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 78,003 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,722 కరోనా కేసులు కొత్తగా నమోదు కాగా.. 134 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉండగా.. 26, 235 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు మొత్తం 2,549 మంది మృత్యువాతపడ్డారు. […]

Ravi Kiran
|

Updated on: May 14, 2020 | 11:20 AM

Share

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 78,003 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,722 కరోనా కేసులు కొత్తగా నమోదు కాగా.. 134 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉండగా.. 26, 235 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు మొత్తం 2,549 మంది మృత్యువాతపడ్డారు.

కాగా, దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 25,922 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 975 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్‌లో 9267 కేసులు, 566 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో 9227 పాజిటివ్ కేసులు నమోదైతే.. వైరస్ కారణంగా 64 మంది చనిపోయారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 7998 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 106 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. రాజస్థాన్‌లో 4,328 కేసులు, 121 మరణాలు నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్‌లో 4173 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. 232 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచారు.

Read This: జూన్ 30 వరకు ప్యాసింజర్ రైళ్లు రద్దు..