AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌ను జూన్ వరకు బంద్ చేస్తారా..?

Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించినా.. నిజాముద్దీన్ మర్కజ్ లింకులతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే దేశవ్యాప్త లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనుండగా.. పెరుగుతోన్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతుంటే.. రెడ్ జోన్స్ ఏర్పాటు చేసి దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని మరికొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే విషయంపై […]

విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌ను జూన్ వరకు బంద్ చేస్తారా..?
Ravi Kiran
|

Updated on: Apr 09, 2020 | 10:36 PM

Share

Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించినా.. నిజాముద్దీన్ మర్కజ్ లింకులతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే దేశవ్యాప్త లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనుండగా.. పెరుగుతోన్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతుంటే.. రెడ్ జోన్స్ ఏర్పాటు చేసి దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని మరికొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే విషయంపై తాజాగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమయ్యారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, సాముహిక మత ప్రార్ధనలపై మే 15 లేదా జూన్ మొదటి వారం వరకు బంద్ విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జనం గుమిగూడే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. వాటికి మినహాయింపు ఇవ్వాలా.. లేక తుది నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలా అన్న దానిపై సమీక్ష జరుపుతున్నారని సమాచారం.

మరోవైపు లాక్ డౌన్ ఎత్తివేసినా ఆంక్షలు విధించాలని, కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక నిన్న జరిగిన ఫ్లోర్ లీడర్ల వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మోదీ సూచనప్రాయంగా పూర్తి లాక్ డౌన్ ఎత్తే ఛాన్స్ లేదని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాని మరోసారి రాష్ట్రాల సీఎంలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…