కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

Coronavirus Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 209 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,518,518 […]

Ravi Kiran

|

Apr 09, 2020 | 2:11 PM

Coronavirus Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 209 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,518,518 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,414 మంది చనిపోవడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 88,495 మంది ప్రాణాలు కోల్పోగా.. 330,589 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(434,927) అమెరికాలో నమోదు కాగా.. కరోనా దాటికి ఇటలీ శవాల దిబ్బగా మారింది. అక్కడ అత్యధికంగా 17,669 మృత్యువాతపడ్డారు. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 5734 కేసులు నమోదు కాగా.. 166 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

 • అమెరికా – 434,927 కేసులు, 14,788 మరణాలు
 • స్పెయిన్ – 148,220 కేసులు, 14,792 మరణాలు
 • ఇటలీ – 139,422 కేసులు, 17,669 మరణాలు
 • జర్మనీ – 113,296 కేసులు, 2,349 మరణాలు
 • చైనా – 81,865 కేసులు, 3,335 మరణాలు
 • ఫ్రాన్స్ – 112,950 కేసులు, 10,869 మరణాలు
 • ఇరాన్ -64,586 కేసులు, 3,993 మరణాలు
 • బ్రిటన్ – 60,733 కేసులు, 7,097 మరణాలు
 • స్విట్జర్లాండ్ – 23,280 కేసులు, 895 మరణాలు
 • టర్కీ – 38,226 కేసులు, 812 మరణాలు
 • బెల్జియం – 23,403 కేసులు, 2,240 మరణాలు
 • నెదర్లాండ్స్ – 20,549 కేసులు, 2,248 మరణాలు
 • కెనడా – 19,438 కేసులు, 427 మరణాలు
 • ఆస్ట్రియా – 12,942 కేసులు, 273 మరణాలు
 • దక్షిణ కొరియా – 10,423 కేసులు, 204 మరణాలు
 • పోర్చుగల్ – 13,141 కేసులు, 380 మరణాలు
 • బ్రెజిల్ – 16,188 కేసులు, 820 మరణాలు
 • ఇజ్రాయెల్ – 9,404 కేసులు, 73 మరణాలు
 • రష్యా – 8,672 కేసులు, 63 మరణాలు
 • స్వీడన్ – 8,419 కేసులు, 687 మరణాలు
 • ఐర్లాండ్ – 6,074 కేసులు, 235 మరణాలు
 • ఆస్ట్రేలియా – 6,052 కేసులు, 50 మరణాలు
 • నార్వే – 6,042 కేసులు, 101 మరణాలు
 • ఇండియా – 5734 కేసులు, 166 మరణాలు

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu