షాకింగ్.. బహిరంగంగా కట్ చేసిన పండ్లు, మాంసం అమ్మితే జైలుకేనట..!

ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. చైనా నగరంలోని వ్యూహన్‌లో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 80 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోగా.. లక్ష మంది వరకు దీని బారినపడ్డారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్ తాకడంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అలీగడ్ నగరంలో జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా మాంసం, కట్ చేసిన పండ్ల […]

షాకింగ్.. బహిరంగంగా కట్ చేసిన పండ్లు, మాంసం అమ్మితే జైలుకేనట..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 07, 2020 | 8:45 PM

ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. చైనా నగరంలోని వ్యూహన్‌లో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 80 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోగా.. లక్ష మంది వరకు దీని బారినపడ్డారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్ తాకడంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అలీగడ్ నగరంలో జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా మాంసం, కట్ చేసిన పండ్ల అమ్మకాలపై నిషేధం విధించారు.

అలీగడ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చంద్ర భూషన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నుంచి దూరంగా ఉండేందుకే.. ఇలా బహిరంగంగా మాంస విక్రయాలతో పాటుగా.. కట్ చేసిన పండ్లు వంటి ఆహార పదార్ధాల విక్రయాలపై బ్యాన్ విధించారు.దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. నిబంధనల ఉల్లింఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా యూపీలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.