Covid-19: కరోనా కంట్రోల్‌కు బరిలోకి కార్పొరేట్

కరోనా వైరస్ ప్రభావంతో కంగారు పడుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అందోళన చెందవద్దని కోరుతున్నాయి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులు. నిఫుణులైన వైద్యులతో కరోనా కంట్రోల్‌కు చర్యలు ప్రారంభించామని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి...

Covid-19: కరోనా కంట్రోల్‌కు బరిలోకి కార్పొరేట్
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 07, 2020 | 4:03 PM

Corporate hospitals into Coronavirus control: కరోనా వైరస్ ప్రభావంతో కంగారు పడుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అందోళన చెందవద్దని కోరుతున్నాయి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులు. నిఫుణులైన వైద్యులతో కరోనా కంట్రోల్‌కు చర్యలు ప్రారంభించామని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. 40 కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా కంట్రోల్ కోసం రంగంలోకి దిగాయి. కేర్, అపోలో, యశోదా వంటి నలభై కార్పొరేట్ హాస్పిటల్స్ నిపుణులైన వైద్యులతో హిత్ సొల్యూషన్ వార్డులు ఏర్పాటు చేశామమని వెల్లడించాయి.

ప్రభుత్వ సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు చేపట్టామని కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యుబ‌ృందం ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలతో ఐటీ ఉద్యోగుల్లో అభద్రతా భావం కలుగుతుందంటోంది ఈ వైద్య బృందం. పుకార్లను వ్యాపింప జేయకుండా చూడాలని కోరుతోంది ఈ బృందం. ఐటీ సెక్టార్‌లో ఎవరికి కరోనా వైరస్ వచ్చినట్లు నిర్ధారణ కాలేదని, అనుమానితులు కూడా ఎవరూ లేరని వైద్య బృందం ప్రకటించింది. పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల హైదరాబాద్ రావాలనుకుంటున్న కొత్త ఐటీ కంపెనీలపై ప్రభావం పడుతుందని అందుకే నిరాధార వార్తలను ప్రచారం చేయవద్దని ఈ బృందం విఙ్ఞప్తి చేస్తోంది.