ఇకపై లీటర్ పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది

ఇక నుంచి బండిలో లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ఉంటే కానీ ముందుకెళ్లని పరిస్థితి త్వరలో రానుంది. దీనికి తగ్గట్టుగా BS-6 మోడల్స్‌లో మార్పులు చేశారు. దీని ప్రకారం వ్యూయల్ ట్యాంక్ నుండి నేరుగా..

ఇకపై లీటర్ పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 07, 2020 | 4:21 PM

ఇక నుంచి బండిలో లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ఉంటే కానీ ముందుకెళ్లని పరిస్థితి త్వరలో రానుంది. దీనికి తగ్గట్టుగా BS-6 మోడల్స్‌లో మార్పులు చేశారు. దీని ప్రకారం వ్యూయల్ ట్యాంక్ నుండి నేరుగా పెట్రోల్, డీజిల్ చేరేలా ఏర్పాటు చేశారు. గతంలో బండిలో పెట్రోల్ అయిపోయినా ప్యూజ్ (చౌక్) ఇచ్చి బండి నడిపే పరిస్థితి ఉండేది. కానీ కొత్త మోడల్స్‌లో అది కుదరదు. కాగా.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ సమయంలో బీఎస్-6 వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఉండాలంటే.. సామాన్యుడి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండనుంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాలుష్యం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా ఆక్సిజన్ సెంటర్స్ ఏర్పరుచుకుని మరీ.. గాలి పీల్చుకునే స్థితి అక్కడ నెలకొంది. దీంతో.. కాలుష్యంను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కాలుష్యం తగ్గడం లేదు. ఇందుకు ముఖ్య కారణం.. పెట్రోల్, డీజిల్లో.. 50 శాతం వరకూ సల్ఫర్ ఉండటమే ఇందుకు కారణం. ఈ సల్ఫర్ ఇంజన్‌లో మండి పొగ రూపంలో బయటకు వస్తుంది. అందులోనూ బీఎస్4 వాహనల్లో వచ్చే పొగ మరింత అధికంగా ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయం తీసుకుంది.

ఇకపై శుద్ధి చేసిన డీజిల్, పెట్రోల్‌ని సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ చమురు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నది. అంతేకాకుండా BS-6 వాహనాల్లో ఆ సౌకర్యం ఉండదు. పెట్రోల్ ట్యాంక్ నుంచి డీజిల్ డైరెక్ట్‌గా ఇంజన్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. దీంతో.. ఇప్పటి నుంచి బండి స్టార్ట్ చేయాలంటే.. కనీసం లీటర్ పెట్రోల్ బండిలో ఉండాల్సిందే. అలాగే మైలేజ్ 12 నుంచి 14 శాతం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఇది కూడా చదవండి:  కరోనా ఎఫెక్ట్: విపరీతంగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu