కాశ్మీర్ లో తొలి కరోనా కేసు.. జమ్మూ, సాంబాలో 31 వరకు స్కూళ్ళు బంద్
జమ్మూ కాశ్మీర్ లో తొలి కరోనా కేసు శనివారం నమోదైంది. ఈ వైరస్ సోకిన రోగి జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జమ్మూ కాశ్మీర్ లో తొలి కరోనా కేసు శనివారం నమోదైంది. ఈ వైరస్ సోకిన రోగి జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ముందు జాగ్రత్త చర్యగా అధికారులు జమ్మూ, సాంబా జిల్లాల్లో అన్ని ప్రైమరీ స్కూళ్లను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో బయో మెట్రిక్ హాజరీ విధానాన్ని ఈ నెల 31 వరకు నిలిపివేస్తున్నట్టు వారు వెల్లడించారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖను హైఅలర్ట్ లో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీనగర్ విమానాశ్రయంలో విదేశీయుల స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా మెడికల్ స్టాఫ్ ని నియమించింది. కరోనా అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులపై వైద్య సంబంధ నిఘాను ఉంచినట్టు అధికారులు పేర్కొన్నారు.
కోవిడ్-19 కారణంగా.. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ నెల 31 వరకు అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది.