‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’పై సర్వే.. షాకింగ్ నిజాలు..!

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఇచ్చాయి. దీంతో చాలామంది కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ.. అటు ఆఫీస్‌ పనిని చేస్తున్నారు.

'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌'పై సర్వే.. షాకింగ్ నిజాలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 4:56 PM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఇచ్చాయి. దీంతో చాలామంది కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ.. అటు ఆఫీస్‌ పనిని చేస్తున్నారు. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ భారతీయుల్లో నిద్రపై బాగా ప్రభావాన్ని చూపుతోందట. ఓ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విషయంలో 1500 మందిపై సర్వే చేసింది. ఇందులో 67 శాతం మంది సరైన సమయానికి నిద్రపోకపోగా.. నిద్రలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చని 81శాతం మంది భావిస్తున్నట్లు వివరించింది.

లాక్‌డౌన్‌కు ముందు 46శాతం మంది 11గం.ల లోపు నిద్రపోతుండగా.. ఇప్పుడు 39శాతం మంది మాత్రమే ఆ సమయంలోపు నిద్రపోతున్నారని సర్వే తెలిపింది. ఇక 12 గం.ల తరువాత పడుకునే వారి సంఖ్య అప్పుడు 25శాతం ఉండగా.. ఇప్పుడు 35శాతానికి పెరిగినట్లు సమాచారం. కాగా లాక్‌డౌన్ తరువాత ఎక్కడివారు అక్కడే ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో పనిమనుషులు కూడా రావడం లేదు. దీంతో ఓ వైపు ఇంటి పని, మరోవైపు ఆఫీస్‌ పని రెండింటిని సమన్వయం చేసుకోవడం చాలా మందికి ఇబ్బందికి మారిందట. ఈ క్రమంలో తెలీకుండానే ఒత్తిడి పడటంతో.. పలువురు నిద్రకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాల్లో కోత పడగా.. అది కూడా పలువురిపై ఎఫెక్ట్ చూపిస్తోందని.. దీంతో భారతీయుల్లో నిద్ర లేమి పెరుగుతోందని సర్వేలో తేలింది.

Read This Story Also: హీరో విడాకుల వెనుక అమలా, గుత్తా.. నటుడు ఏమన్నాడంటే..!

Latest Articles
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే