లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: అత్యవసర సేవలకు.. ఉచిత క్యాబ్‌ సర్వీస్‌..!

తెలంగాణలో రోజురోజుకు కోవిద్-19 కేసులు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం మహేంద్ర ఎలైట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ సంస్థ ఉచిత క్యాబ్‌ సర్వీస్‌ అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే రాచకొండ,

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: అత్యవసర సేవలకు.. ఉచిత క్యాబ్‌ సర్వీస్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 5:40 PM

తెలంగాణలో రోజురోజుకు కోవిద్-19 కేసులు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం మహేంద్ర ఎలైట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ సంస్థ ఉచిత క్యాబ్‌ సర్వీస్‌ అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న ఈ సేవలను నేటి నుంచి హైదరాబాద్‌ కమిషనరేట్‌కు విస్తరించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద సీపీ అంజనీకుమార్‌ జెండా ఊపి క్యాబ్‌ సేవలను ప్రారంభించారు.

కాగా.. లాక్ డౌన్ క్రమంలో క్యాబ్ సర్వీసెస్ సేవలు లభించడంలేదు. కాబట్టి సీనియర్‌ సిటిజన్స్‌, గర్భవతులు, చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తినపుడు ఈ క్యాబ్‌ల ద్వారా ఆస్పత్రులకు చేరుస్తారు. ఈ అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు ఏడు క్యాబ్‌ల ద్వారా ఉచితంగా సేవలందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్యాబ్‌ బుకింగ్‌ కోసం 8433958158 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

Also Read: లాక్ డౌన్ ఎఫెక్ట్: మాస్కులు ధరించని వారికి నిత్యావసరాలు బంద్..!