తెలంగాణలో ఉన్న కేసులు వివరాలు చెప్పిన సీఎం కేసీఆర్‌

కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కొత్తగా ఇవాళ 11 కరోనా పాజిటివ్ కేసులు […]

తెలంగాణలో ఉన్న కేసులు వివరాలు చెప్పిన సీఎం కేసీఆర్‌
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 10:10 PM

కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

కొత్తగా ఇవాళ 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 439 అని వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కఠినంగానే అమలు చేస్తున్నామని.. అసలు కంటైన్మెంట్‌ జోన్ అనేది కరీంనగర్‌లో తొలుత ప్రకటించిందే మన తెలంగాణ రాష్ట్రమని సీఎం కేసీఆర్ తెలిపారు. తొలుత కరీంనగర్‌లో పదకొండు మంది ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్‌ వస్తే.. కరీంనగర్‌ను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి కరోనా వ్యాప్తి చెందకుండా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.