బ్రేకింగ్: లాక్‌డౌన్ పొడిగించిన సీఎం కేసీఆర్.. ఎప్పటివరకూ అంటే?

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేబినేట్ భేటీ ముగిసిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీ వరకూ లాక్‌డౌన్..

  • Tv9 Telugu
  • Publish Date - 10:09 pm, Tue, 5 May 20
బ్రేకింగ్: లాక్‌డౌన్ పొడిగించిన సీఎం కేసీఆర్.. ఎప్పటివరకూ అంటే?

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేబినేట్ భేటీ ముగిసిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. అలాగే  ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ కీలక వ్యాఖ్యలు:

-రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ
-ఆగష్టు వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి
-ప్రజలందరూ లాక్‌డౌన్‌కి సహకరించాలి.
-తెలంగాణ రాష్ట్రంలో ఆరు జిల్లాలో రెడ్ జోన్‌లో ఉన్నాయి
-తెలంగాణలో 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి
-యాదాద్రి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి, సిద్ధిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి జిల్లాలు
-అలాగే 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. అవి: సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట్, సిరిసిల్ల, నల్గొండ జిల్లాలు ఉన్నాయి
-ఇక రెడ్ జోన్‌లో చాలా కఠినంగా వ్యవహరిస్తాం
– రెడ్ జోన్లలో ఈ నెల 15 వరకూ ఎలాంటి షాపులూ తెరవకూడదు
– ఈ నెల 15న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. సమావేశం అనంతరం రెడ్ జోన్లలో సడలింపులు ప్రకటిస్తాం

మరిన్ని వివరాలు ఈ క్రింది లైవ్‌లో చూడండి:

Read More:

బ్రేకింగ్: దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

ఉదయ్ కిరణ్‌ చావుకు ఆ అగ్ర హీరోకి సంబంధం లేదు.. తేల్చిచెప్పిన తేజ!