దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తాజా వివరాలు..

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తాజా వివరాల హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 905 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 9352కు చేరింది. ప్రస్తుతం 8048 యాక్టివ్ కేసులు ఉన్నాయి.980 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 51మంది మృతిచెందారని.. దీంతో […]

Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 9:32 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తాజా వివరాల హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 905 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 9352కు చేరింది. ప్రస్తుతం 8048 యాక్టివ్ కేసులు ఉన్నాయి.980 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 51మంది మృతిచెందారని.. దీంతో ఇప్పటికీ చనిపోయిన వారి సంఖ్య 324కి చేరినట్లు హెల్త్ బులిటెన్‌లో కేంద్రం పేర్కొంది. ఇక పలురాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో.. ఈ నెల ఏప్రిల్ 30వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ప్రజల్ని ఉద్ధేశించి.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రసంగించనున్నారు.