అక్తర్‌కు అఫ్రిదీ వత్తాసు.. మోదీపై సంచలన వ్యాఖ్యలు..

మూర్ఖత్వంలో.. మరి ఇంకేం అనాలో తెలియదు గానీ.. కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతున్న సమయంలో భారత్, పాక్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలంటూ పాకిస్తాన్ క్రికెటర్లు పట్టుబడుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న షోయాబ్ అక్తర్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా.. భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా అక్తర్ కామెంట్స్ ను తప్పుబట్టారు. అయితే ఇవాళ షాహిద్ అఫ్రిదీ అక్తర్ కు వత్తాసు […]

అక్తర్‌కు అఫ్రిదీ వత్తాసు.. మోదీపై సంచలన వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Apr 13, 2020 | 9:56 PM

మూర్ఖత్వంలో.. మరి ఇంకేం అనాలో తెలియదు గానీ.. కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతున్న సమయంలో భారత్, పాక్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలంటూ పాకిస్తాన్ క్రికెటర్లు పట్టుబడుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న షోయాబ్ అక్తర్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా.. భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా అక్తర్ కామెంట్స్ ను తప్పుబట్టారు.

అయితే ఇవాళ షాహిద్ అఫ్రిదీ అక్తర్ కు వత్తాసు పలుకుతూ.. పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు.. అంతేకాక ఫైనాన్షియల్‌ క్రైసస్ నుంచి బయటపడేందుకు ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌లు ప్రారంభించాలని కోరాడు. అంతటితో ఆగకుండా మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మోదీ ప్రభుత్వం కారణంగానే ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు సరిగ్గా లేవని ఆరోపించాడు. అంతేకాక పాక్ ఎప్పుడూ సానూకూలతగా వ్యవహరిస్తుంటే.. మోదీ ప్రభుత్వం నెగిటివిటీని వ్యాపిస్తోందంటూ తీవ్రంగా విమర్శించాడు. కాగా, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇండియా- పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని భారత ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

ఇది మన భారతం.. పేదోడి ఆకలి కేకలు.. రోడ్డుపై పారబోసిన పాలకై ప్రయత్నం..