పోలీస్ స్టేషన్ లో కరోనా కలవరం

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ ను సైతం వైరస్ వదలడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీసులు సైతం కరోనాతో మృతి చెందారు. తాజాగా యాదాద్రి భువనగిరి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది.

పోలీస్ స్టేషన్ లో కరోనా కలవరం
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 08, 2020 | 6:02 PM

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ ను సైతం వైరస్ వదలడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీసులు సైతం కరోనాతో మృతి చెందారు. తాజాగా యాదాద్రి భువనగిరి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది. భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీస్‌స్టేషన్‌ను శానిటైజర్ చేశారు. పోలీసులు విధులు నిర్వర్తించక తప్పదు. ప్రస్తుత పరిస్థితులు భయాకంగా మారాయంటున్నారు. నిత్యం ప్రజల్లో మమేకమయ్యే పోలీసులకు ఎక్కడో ఒకచోట కరోనా సోకే అవకాశాలు ఉంటాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగిని క్వారంటైన్ కు తరలించిన అధికారులు.. అతనితో కాంటాక్ట్ అయినవారిని ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు.