2021 నాటికి 25 కోట్ల మందికి కరోనా..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. దేశాలన్నీ కూడా ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు దశలవారీగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. వైరస్ వ్యాప్తి అంతకంతకూ తీవ్రతరం అవుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11,981,313 మందికి ఈ మహమ్మారి సోకగా.. 547,324 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక మున్ముందు ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు నమోదైన వాటి కంటే 12 రెట్లు ఎక్కువగా.. మరణాలు 50 శాతం అధికంగా […]

2021 నాటికి 25 కోట్ల మందికి కరోనా..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 08, 2020 | 6:52 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. దేశాలన్నీ కూడా ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు దశలవారీగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. వైరస్ వ్యాప్తి అంతకంతకూ తీవ్రతరం అవుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11,981,313 మందికి ఈ మహమ్మారి సోకగా.. 547,324 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక మున్ముందు ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు నమోదైన వాటి కంటే 12 రెట్లు ఎక్కువగా.. మరణాలు 50 శాతం అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ మహమ్మారిని కట్టడి చేయకుంటే 2021 నాటికి ప్రపంచంలో 25 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడతారనిపరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా 18 లక్షల మంది కరోనాతో మరణించే ప్రమాదం ఉందన్నారు. అటు దేశంలో కూడా రోజుకు 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అమెరికాలో రోజుకు 95,000, దక్షిణాఫ్రికాలో 21,000, ఇరాన్‌లో 17,000 కేసులు నమోదు కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో ఉన్న 4.75 బిలియన్ల జనాభా సమాచారాన్ని పరిశీలించి ఎంఐటీ ప్రొఫెసర్లు అయిన హజీర్ రెహ్మాండాద్, జాన్ స్టెర్మాన్, డాక్టరేట్ స్టూడెంట్ త్సే యాంగ్ లిమ్తో కలిసి ఈ గణాంకాలను చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత, నిర్ధారణ పరీక్షలు, నమోదైన కేసులు, మరణాలు, వ్యక్తిగత శుభ్రత, ఆసుపత్రుల సామర్థ్యం, సామాజిక వైఖరులు వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ఈ అంచనాలను వేశారు.