AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ టెన్ లిస్టులోకి చేరిన భారత్.. 4 వేలు దాటిన కరోనా మరణాలు..

భార‌త్‌లో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4021 మంది మృతి చెందారు. అటు 77,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు విషయంలో భారత్ ఇరాన్‌ను దాటేసి టాప్ టెన్ లిస్టులోకి చేరిపోయింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 135,701 కేసులు నమోదు కాగా భారత్‌లో […]

టాప్ టెన్ లిస్టులోకి చేరిన భారత్.. 4 వేలు దాటిన కరోనా మరణాలు..
Ravi Kiran
|

Updated on: May 25, 2020 | 9:50 AM

Share

భార‌త్‌లో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4021 మంది మృతి చెందారు. అటు 77,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు విషయంలో భారత్ ఇరాన్‌ను దాటేసి టాప్ టెన్ లిస్టులోకి చేరిపోయింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 135,701 కేసులు నమోదు కాగా భారత్‌లో 138,845 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలు ఆ తర్వాత ఉన్నాయి.

మహారాష్ట్ర టాప్, తమిళనాడు నెక్స్ట్.. 

కోయంబేడు లింకులతో తమిళనాడులో కరోనా రక్కసి తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో మ‌హారాష్ట్ర అత్యధికంగా 50 వేలు పైచిలుకు కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు 16,277 పాజిటివ్ కేసులు, 111 మరణాలతో రెండో స్థానంలోకి చేరింది. మొన్న‌టి వ‌ర‌కు గుజ‌రాత్ అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, ఇప్పుడు త‌మిళ‌నాడు గుజ‌రాత్ స్థానాన్ని ఆక్ర‌మించేసింది. అటు గుజ‌రాత్‌లోనూ కోవిడ్‌-19 భూతం జ‌డ‌లు విప్పుకుంటోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 14,056 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 858 మంది ప్రాణాలు విడిచారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా విలయం సృష్టిస్తోంది. అక్కడ 13,418 పాజిటివ్ కేసులు 261 మరణాలు సంభవించాయి.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 2823 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కేసులు గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. అటు తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా 1854 పాజిటివ్ కేసులు, 53 మరణాలు సంభవించాయి. ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.

వీధులు ఊడుస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు లక్ష రూపాయల జీతం!
వీధులు ఊడుస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు లక్ష రూపాయల జీతం!
లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!