CORONA WARNING: కరోనా వైరస్‌పై కేంద్రం తాజా హెచ్చరిక.. అదే జరిగితే ఆపడం ఎవరి తరం కాదు..!
కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కే.పాల్ స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ మ్యూటెంట్ అవుతోందని, కొత్త రకంగా వైరస్ పిల్లలపై పెను ప్రభావం చూపే ప్రమాదం...
CORONA WARNING BY UNION GOVERNMENT: కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ (NITI AYOG) సభ్యుడు డాక్టర్ వి.కే.పాల్ (DR V K PAUL) స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ మ్యూటెంట్ (CORONA VIRUS MUTANT) అవుతోందని, కొత్త రకంగా వైరస్ పిల్లలపై పెను ప్రభావం చూపే ప్రమాదం వుందని ఓ వైపు కథనాలు వస్తున్న నేపథ్యంలోనే నీతి ఆయోగ్ సభ్యుడు ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. థర్డ్ వేవ్ (CORONA THIRD WAVE) భయాందోళన యావత్ దేశాన్ని ముంచెత్తిన తరుణంలో కేంద్రం చేసిన ఈ తాజా హెచ్చరికపై ప్రతీ పౌరుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
కరోనా వైరస్ పిల్లలపై ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపకపోయినా వైరస్ మ్యూటెంట్ అయిన తర్వాత దాని సంక్రమణ తీరుతెన్నుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ మార్పులు మరింత తీవ్రమైతే.. పిల్లలపై చూపే ప్రభావం తీవ్రంగా వుంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాంటి పరిస్థితులు వస్తే సమర్థంగా ఎదుర్కొనడానికి తగిన చర్యలు తీసుకున్నామని డాక్టర్ వి.కె.పాల్ తెలిపారు. పిల్లల్లో కోవిడ్ చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. పిల్లల్లో వైరస్ ప్రవర్తన, ప్రభావం, క్లినికల్ ప్రోఫైల్ (CLINICAL PROFILE), అందుబాటులో ఉన్న డేటాను అనలైజ్ చేసిన ఈ నిపుణుల బృందం… సన్నద్ధతకు సంబంధించిన మార్గదర్శకాలను రెడీ చేసిందని తెలిపారు. ఇప్పటివరకు పిల్లల వైద్య వ్యవస్థపై భారం పడలేదని, కాకపోతే రాబోయే రోజుల్లో కరోనా వైరస్ బారినపడ్డ పిల్లల్లో 2 నుంచి 3 శాతం మందిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావొచ్చని తెలిపారు. పిల్లల్లో కోవిడ్ చికిత్సకు అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలను కేంద్రం త్వరలోనే విడుదల చేస్తుందని పాల్ వివరించారు.
అయితే పిల్లలకు కరోనా వైరస్ సంక్రమించినా వారిలో పెద్దగా లక్షణాలు కనిపించమని తెలుస్తోంది. పిల్లలకు కరోనా సంక్రమణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో కరోనా బారినపడే పిల్లలకు అవసరమైన సంరక్షణ, మౌలిక సదుపాయాల్లో ఎటువంటి లోపం ఉండదని వెల్లడించారు. పిల్లల్లో కరోనా అసింప్టమాటిక్‌గానే ఉంటుందని, చాలా అరుదుగా ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం వస్తుందని డాక్టర్ పాల్ అన్నారు. పిల్లల్లో కోవిడ్–19 (COVID-19) రెండు రూపాల్లో ఉంటుందని వివరించారు. ఒకవేళ లక్షణాలు కనిపించినా.. ఇన్ఫెక్షన్ (INFECTION), దగ్గు (COUGH), జ్వరం (FEVER), న్యుమోనియా (NUMONEA) వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కరోనా వైరస్ సోకిన రెండు నుంచి ఆరు వారాల దాకా ఇది ఎక్కువగా అసింప్టమేటిక్‌గానే ఉంటుంది. కానీ కొంతమంది పిల్లల్లో జ్వరం, శరీరంపై దద్దుర్లు, కండ్ల కలక, శ్వాస సమస్యలు, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కేవలం ఊపిరితిత్తులను ప్రభావితం చేసే న్యుమోనియాగా పరిమితం కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. దీనిని మల్టీ–సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MULTI-SYSTEM INFLAMATORY CYNDROME) అంటారు. ఇది పోస్ట్–కోవిడ్ (POST COVID) లక్షణం. అయితే పోస్ట్ కోవిడ్ పీరియడ్‌లో బాడీలో వైరస్ కనుగొనలేమని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్–19 టెస్ట్ సైతం నెగెటివ్‌గా వస్తుంది. కానీ యాంటీబాడీ పరీక్ష (ANTI-BODY TEST)లో పిల్లలకి కోవిడ్–19 సోకినట్లు తెలుస్తుంది. కొంతమంది పిల్లలలో కనిపించే ఈ ప్రత్యేక వ్యాధి చికిత్సకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అయితే ఈ వ్యాధికి చికిత్స కష్టం కానప్పటికీ సకాలంలో అందించాల్సిన అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: బెంగాల్ హింసపై సుప్రీంకు విద్యావేత్తల లేఖ.. మమత మెడకు బిగుస్తున్న ఉచ్చు