దేశంలో 60 వేలకు చేరువైన కరోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కూడా కేసుల తీవ్ర‌త త‌గ్గడం లేదు. కాగా, ప్రస్తుతం దేశంలో మూడోదశ లాక్ డౌన్ కొనసాగుతోంది. దీనిలో కేంద్రం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో భారీగా సడలింపులు ఇచ్చింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59,662 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో యాక్టివ్ కేసులు 39,834 ఉండగా.. 17,846 వైరస్ నుంచి […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

May 09, 2020 | 9:37 PM

దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కూడా కేసుల తీవ్ర‌త త‌గ్గడం లేదు. కాగా, ప్రస్తుతం దేశంలో మూడోదశ లాక్ డౌన్ కొనసాగుతోంది. దీనిలో కేంద్రం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో భారీగా సడలింపులు ఇచ్చింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59,662 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో యాక్టివ్ కేసులు 39,834 ఉండగా.. 17,846 వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా 1,981 మంది ప్రాణాలు విడిచారు.

తాజా సమాచారం ప్రకారం ఏపీ-1887, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 33, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 59, బీహార్ – 571, ఛండీగర్-150, ఛత్తీస్‌ఘడ్‌-59, దాదర్ నగర్ హవేలీ- 1, ఢిల్లీ-6318, గోవా-7, గుజరాత్-7402, హర్యానా-647, హిమాచల్‌ప్రదేశ్-50, జమ్ముకశ్మీర్-823, జార్ఖండ్ – 132, కర్ణాటక- 753, కేరళ-503, లడాక్-42, మధ్యప్రదేశ్‌-3341, మహారాష్ట్ర-19063, మణిపూర్‌-2, మిజోరం- 1, మేఘాలయా- 12, నాగాలాండ్- 0, ఒడిశా – 271, పుదుచ్చేరి -9, పంజాబ్-1731, రాజస్థాన్-3579, తమిళనాడు-6009, తెలంగాణ-1133, త్రిపుర – 118, ఉత్తరాఖండ్ – 63, యూపీ-3214, పశ్చిమ బెంగాల్-1678 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(731)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(449), మధ్యప్రదేశ్(200), రాజస్తాన్‌(97), పశ్చిమ బెంగాల్(160) రాష్ట్రాలు ఉన్నాయి.

Read More:

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu