అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ రెండో కరోనా కేసు నమోదు కావడంతో ఆ దేశంలో సంచలనం రేపింది. వైట్ హౌస్‌లో పనిచేసే యు.ఎస్. మిలిటరీ సభ్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ వ్యక్తి అధ్యక్షుడు ట్రంప్ పర్సనల్ స్టాఫర్ అని సమాచారం.
“వైట్ హౌస్‌లో పనిచేసే యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ సభ్యుడికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు వైట్ హౌస్ మెడికల్ యూనిట్ ద్వారా ఇటీవలే తమకు తెలిసిందని” వైట్ హౌస్ డిప్యూటీ సెక్రటరీ హొగన్ గిడ్లీ ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు కరోనా వైరస్ టెస్టులు చేశామని.. వీరిద్దరూ కూడా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారని” గిడ్లీ చెప్పారు.
తన పర్సనల్ స్టాఫ్‌కు కరోనా వైరస్ సోకడంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కలత చెందారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలియజేశారు. వైరస్ సోకిన వ్యక్తి అప్పుడప్పుడూ ట్రంప్‌కు భోజనం వడ్డించేవారని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే వైట్ హౌస్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో.. అక్కడ వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయాలని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్వేతసౌథంలో పని చేసే సిబ్బంది ప్రతీ ఒక్కరూ కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారట.
Read More:
ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!
‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!
మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!
గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..