గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఇలా మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ విజృంభణ స్టార్ అయింది. దీనితో లాక్ డౌన్ షురూ అయింది. అంతే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? విద్యార్థుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ […]

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..
Follow us

|

Updated on: May 09, 2020 | 8:22 AM

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఇలా మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ విజృంభణ స్టార్ అయింది. దీనితో లాక్ డౌన్ షురూ అయింది. అంతే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? విద్యార్థుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఇక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేశాయి. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి. ఈ నేపధ్యంలో 5 నుంచి 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రీ-బోర్డు పరీక్షా ఫలితాలు ఆధారంగా 10వ తరగతి విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్ణయాన్ని పాటిస్తామని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు.

Read More:

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!