Corona New Variant: కరోనా కొత్త వేరియంట్ ఆనవాళ్ళు మనదేశంలో లేవు.. అయినా జాగ్రత్తలు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వ సూచనలు!

KVD Varma

KVD Varma |

Updated on: Nov 26, 2021 | 5:00 PM

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ కేసు ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడా వెలుగులోకి రాలేదు.

Corona New Variant: కరోనా కొత్త వేరియంట్ ఆనవాళ్ళు మనదేశంలో లేవు.. అయినా జాగ్రత్తలు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వ సూచనలు!
Coronavirus
Follow us

Corona New Variant: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ కేసు ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడా వెలుగులోకి రాలేదు. దేశవ్యాప్తంగా పరీక్షా ల్యాబ్‌లకు పంపిన శాంపిల్స్‌లో బి.1.1.529 అనే ఈ వేరియంట్ కనుక్కోవడం జరగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది భారత్‌కు ఊరటనిచ్చే వార్త. అయితే, ఈ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని, హాంకాంగ్, బోట్స్వానా నుండి వచ్చే ప్రయాణికులను పరీక్షించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా తీసుకోవాలని రాష్ట్రాలను కూడా ఆదేశించింది. దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా నుండి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షించాలని కూడా ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

సౌతాఫ్రికా పొరుగు దేశమైన బోత్సవానాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. B.1.1529 పేరు కలిగిన ఈ వేరియంట్‌ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లుగా ఎన్ఐసీడీ తెలిపింది. దక్షిణాఫ్రికాలో అనేక రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్న కొత్త వేరియంట్‌ను నిపుణులు గుర్తించారు. దీంతో భారత ప్రభుత్వం ఎలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా అన్ని ల్యాబ్ లలో కరోనా కొత్త వేరియంట్ విషయంపై కూలంకషంగా పరీక్షలు జరపాలని సూచించింది. మరోవైపు కరోనా కొత్త వేవ్ వ్యాప్తి పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరోనా ప్రోటోకాల్ ను కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ప్రస్తుతం మన దేశంలో ఈ కొత్త కరోనా వేరియంట్ కనిపించకపోయినా.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

వేగంగా వ్యాక్సినేషన్..

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం, మన దేశంలో నవంబర్ 24 వరకూ మొత్తం18 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు. డేటా ప్రకారం, నవంబర్ 24, ఉదయం 7 గంటల వరకూ దేశంలో మొత్తం 1,18,44,23,573 వ్యాక్సిన్‌లు ఇచ్చారు. ఇందులో 77,09,92,940 మొదటి డోసులు.. 41,34,30,633 రెండవ డోసులు ఉన్నాయి.

కాగా, దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. అయితే, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.33 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి తర్వాత ఈ స్థాయికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. డైలీ పాజిటివిటి రేటు 0.79 శాతం ఉంది.

ఇవి కూడా చదవండి: PM Gati Shakti: భారత దేశ గతిని మార్చేసే పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ రెడీ.. ఎన్ని ప్రాజెక్టులు రానున్నాయంటే?

Maharashtra Politics: మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే

Earth Quake: మిజోరంలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu