AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు.. కారణం ఇదే!

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీని ఎఫెక్ట్‌తో అన్ని దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. వేలల్లో మరణిస్తున్నారు. ఇప్పుడు కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పంటిస్తున్నారు..

కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు.. కారణం ఇదే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 09, 2020 | 6:40 PM

Share

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీని ఎఫెక్ట్‌తో అన్ని దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. వేలల్లో మరణిస్తున్నారు. ఇప్పుడు కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పంటిస్తున్నారు ప్రజలు. సాధారణంగా పెన్‌డ్రైవ్, సీడీలు లేదా ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్లు, మొబైళ్లకు వైరస్ వ్యాపిస్తుందని తెలుసు. ఇదిగో ఇప్పుడు ఇదే భయంతో యూకే ప్రజలు.. పలు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మిన ప్రజలు మొబైల్ టవర్లను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 10కి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు.

ప్రస్తుతం 4జీ కంటే.. మరింత మెరుగైన నెట్ వర్క్‌ని అందించేందుకు మొబైల్ సంస్థలు 5 జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఈ టెక్నాలజీ, సిగ్నల్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న కరోనా వైరస్ మరణాలకు 5జీ మొబైల్ నెట్‌వర్క్ కూడా కారణమని పేర్కొన్నారు. ఈ వదంతులను నమ్మిన ప్రజలు 5జీ టవర్లపై పలు దాడులకు పాల్పడుతున్నారు.

అలా మొత్తంగా ఇప్పటి వరకూ పది మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. వాటిని తగలబెడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాక చాలా నష్టం ఏర్పడుతోందని నెట్‌వర్క్ సంస్థల అధికారులు వెల్లడించారు. ఈ వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించి.. అతస్య ప్రచారాలను ప్రచారం చేసే వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు అధికారులు.

కాగా.. అలాగే 5జీ మొబైల్ నెట్‌వర్క్‌తో కరోనా వైరస్ వ్యాప్తిస్తుందనే ప్రచారం పూర్తి అవాస్తవమని నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) స్పష్టం చేసింది. కేవలం మనిషి నుంచి మనిషికి లేదా బాధితుడు తాకిన వస్తువుల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనేది పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని వారు కోరారు.

ఇవి కూడా చదవండి:

హైదరాబాద్‌లో భారీ వర్షం

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ..

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌