‘ఆ రియల్ టైం హీరోలకు నా హోటల్ ఇస్తా..’ సోను సూద్

Umakanth Rao

Umakanth Rao | Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 6:19 PM

కరోనాపై నిర్విరామంగా పోరాడుతూ.. రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లకు ముంబై.. జుహూలోని తన హోటల్ ని బస కోసం ఇస్తానని ప్రముఖ నటుడు సోను సూద్ ప్రకటించారు.

'ఆ రియల్ టైం హీరోలకు నా హోటల్ ఇస్తా..' సోను సూద్

Follow us on

కరోనాపై నిర్విరామంగా పోరాడుతూ.. రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లకు ముంబై.. జుహూలోని తన హోటల్ ని బస కోసం ఇస్తానని ప్రముఖ నటుడు సోను సూద్ ప్రకటించారు. కోవిడ్ పై పోరు జరుగుతున్న ఈ కఠిన పరిస్థితుల్లో అలసటను కూడా పట్టించుకోకుండా పగలనక, రేయనక సేవలందిస్తున్న వీరికి నా హోటల్ తలుపులు తెరిచి ఉంచుతున్నా అని ఆయన తన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొన్నారు. ఈ నేషనల్ హీరోలకు ఇంతకు మించి నేనేం సాయం చేయగలను అన్నారు.  దేశంలోని లక్షలాది మంది ప్రాణాలను రక్షించడానికి ఈ డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి నా వంతు సాయంగా ఇలా చేయడం నా బాధ్యత, గౌరవంగా భావిస్తున్నా అని సోను సూద్ అన్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని కలుగ జేస్తోంది అని పేర్కొన్నారు. ఇటీవల మరో అగ్రనటుడు షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి ..తమ నాలుగంతస్థుల పర్సనల్ ఆఫీసును క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు సంసిధ్ధత వ్యక్తం చేశారు. ఇందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. టాలీవుడ్ దిగ్గజాలతో బాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కరోనాపై పోరాటానికి తమ విరాళాలను పీఎం కేర్స్ ఫండ్ కు అందజేశారు. ప్రస్తుతం లాస్ ఏంజిలిస్ లో ఉన్న ప్రియాంక చోప్రా సైతం భారీగా విరాళాలు సేకరిస్తున్నారు.

View this post on Instagram

🙏

A post shared by Sonu Sood (@sonu_sood) on

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu