కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

లాక్‌డౌన్‌తో కాస్తా.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కొత్తగా పెళ్లైన జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందట. ఇప్పటికే పెళ్లయి రోజూ ఉద్యోగాలకి వెళ్లే జంటలు కూడా ఈ సమయం వారికి హనీమూన్‌లా..

కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 26, 2020 | 6:59 AM

కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. భారత్‌లోనూ.. దీని బారిన పడి 500లకి పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 11 మంది మరణించారు. దీంతో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. వచ్చే నెల 15వ తేదీ వరకూ లాక్‌డౌన్ ప్రకటించారు. నిజానికి ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించగా.. రోజు రోజుకీ కరోనా విజృంభిస్తూండటంతో.. ఇలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కేవలం ఎమర్జెన్సీ, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అదికూడా ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక సమయంలోనే వెళ్లి తెచ్చుకోవాలి. అలాగే.. ఎక్కువ ధరలకు సరుకులను అమ్మినా కూడా కఠినమైన శిక్షలు తీసుకుంటామని అన్ని ప్రభుత్వాలు ఇప్పటికే తెలిపాయి.

కాగా.. లాక్‌డౌన్‌తో కాస్తా.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కొత్తగా పెళ్లైన జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందట. ఇప్పటికే పెళ్లయి రోజూ ఉద్యోగాలకి వెళ్లే జంటలు కూడా ఈ సమయం వారికి హనీమూన్‌లా మారిందని అంటున్నారు. నిత్యావసరాలతో పాటు కండోమ్స్, ఐపిల్స్ సేల్స్ పెరిగినట్టు మార్కెట్ల వర్గాలు చెబుతున్నారు. ఏదేమైనా బయటకి రాకుండా ఉండటం అనేదే కాన్సెప్ట్ కాబట్టి అలా వారు సహకరిస్తే 21 రోజుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అంటున్నారు ప్రభుత్వ అధికారులు.

ఇవి కూడా చదవండి: 

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!