Coronavirus: భయపెడుతోన్న కరోనా.. ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజులో ఏకంగా..

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్‌ మరో వైపు డెల్టా కేసులు నమోదవుతున్నాయి...

Coronavirus: భయపెడుతోన్న కరోనా.. ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజులో ఏకంగా..
Follow us

|

Updated on: Jan 07, 2022 | 4:35 PM

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్‌ మరో వైపు డెల్టా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి భయాందోళనలు నెలకొనే పరిస్థితులు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అనూహ్యంగా కోవిడ్‌ కేసులు పెరిగాయి. గడిచిన ఒక్కరోజులోనే (గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు) ఏకంగా 840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మొత్తం 37,849 శాంపిల్స్ పరీక్షించగా 840 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా విశాఖలో 183 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 150, కృష్ణలో 88 , ఈస్ట్ గోదావరిలో 70, నెల్లూరులో 69 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో కోవిడ్‌ కారణంగా ఒకరు మరణించడం భయాందోళనకు గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2972 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 133 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనాతో ఒమిక్రాన్‌ కూడా అలజడి సృష్టిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007 కి చేరింది. వీటిలో అధ్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114, తెలంగాణలో 107, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 27 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Also Read: Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

ICMR : ఒమిక్రాన్‌తో భయం లేదు.. లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స.. ఐసీఎంఆర్ నిపుణుల కీలక వ్యాఖ్యలు..

సింపుల్‌ స్టెప్స్‌తో వాట్సాప్‌లో యూపీఐ పిన్‌ మార్చుకోండిలా..!