ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులకు కరోనా
చిన్నాపెద్ద అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. వైరస్ బారిన పడ్డవారిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. వరుసగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 73 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో ఆరోగ్య ఆంధ్ర ప్రకటించింది. రాష్ట్రంలో అత్యధికంగా 343 పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. వైరస్ బారిన పడ్డవారిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులకు కరోనా సోకడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలానికి చెందిన 11 నెలల పాపకు, 10 ఏళ్ల బాబుకు కరోనా పాజిటివ్ అని తేలంది. క్వారంటైన్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత రోజు చిన్నారులకు కోవిడ్ వైరస్ సోకినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వరంటైన్‌కు తరలించేందుకు వారు అంగీకరించలేదు. దీంతో చిన్నారులిద్దరికీ హెంక్వారంటైన్‌లోనే చికిత్స అందిస్తున్నారు.
ఇక, కర్నూలు తర్వాత గుంటూరు జిల్లా 283 కేసులు ఉన్నాయి.. ఇక కృష్ణా జిల్లా కూడా 236 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 287మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 31మంది చనిపోయారు.




