బ్రేకింగ్: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

మల్కాజిగిరికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ స్టేట్ మైనార్టీ సెల్ ఛైర్మన్ మహ్మద్ సిరాజుద్ధీన్‌ కరోనా సోకి మృతి చెందారు. హైదరాబాద్‌ సన్ షైన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. నిన్న రాత్రి 10.30 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. కాగా సిరాజుద్దీన్ మృతి చెందినట్టు..

  • Tv9 Telugu
  • Publish Date - 5:05 pm, Mon, 6 July 20
బ్రేకింగ్: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

తాజాగా మల్కాజిగిరికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ స్టేట్ మైనార్టీ సెల్ ఛైర్మన్ మహమ్మద్ సిరాజుద్దీన్‌ కరోనా సోకి మృతి చెందారు. హైదరాబాద్‌ సన్ షైన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. నిన్న రాత్రి 10.30 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. కాగా సిరాజుద్దీన్ మృతి చెందినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక ఆయన మృతి పట్ల ఏఐసీసీ ఇంఛార్జి ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, టీ.పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికార ప్రతినిధి నిరంజన్.. తదితరులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సిరాజుద్దీన్ పార్టీలో ఒక క్రమశిక్షణ గల నాయకుడని, మంచి భవిష్యత్ ఉన్న నాయకుడి కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు పార్టీ నేతలు.

Read More: 

ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?