కొబ్బరి నూనెతో కరోనాకు చెక్…!?

Coconut Oil Help Fight Covid-19 : ప్రపంచం మొత్తం ఒకటే ఆలోచిస్తోంది. ఎప్పుడు..? ఎలా…? ఈ మహమ్మారి తరిమేయాలన్నదే.. అందరి ఆలోచన… అన్ని దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు కుస్తీలు పడుతున్నాయి. ఇదిలా వుంటే సామాన్య ప్రజలు ఎవరి స్థాయిలో వారు “వంటింటి వైద్యం” చేసుకుంటున్నారు. చాలా మంది కషాయం తీసుకుంటున్నారు. కరోనా అన్నది వైరస్ కావడం, ఈ మహమ్మారికి సరైన మందు ఇప్పడప్పుడే.. రాదని తేలిపోవడంతో ఇది ప్రపంచ దేశాల్లోని ప్రజలు మరింత వణికిస్తోంది. వేగంగా […]

కొబ్బరి నూనెతో కరోనాకు చెక్...!?
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2020 | 4:33 PM

Coconut Oil Help Fight Covid-19 : ప్రపంచం మొత్తం ఒకటే ఆలోచిస్తోంది. ఎప్పుడు..? ఎలా…? ఈ మహమ్మారి తరిమేయాలన్నదే.. అందరి ఆలోచన… అన్ని దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు కుస్తీలు పడుతున్నాయి. ఇదిలా వుంటే సామాన్య ప్రజలు ఎవరి స్థాయిలో వారు “వంటింటి వైద్యం” చేసుకుంటున్నారు. చాలా మంది కషాయం తీసుకుంటున్నారు.

కరోనా అన్నది వైరస్ కావడం, ఈ మహమ్మారికి సరైన మందు ఇప్పడప్పుడే.. రాదని తేలిపోవడంతో ఇది ప్రపంచ దేశాల్లోని ప్రజలు మరింత వణికిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం ఒక్కటే ఇప్పటి వరకు ఉన్న మార్గమని పరిశోధకులు తెలిపారు. ఈ మార్గం తప్పించి మరొక మార్గం లేదని ప్రపంచదేశాలు నమ్ముతున్నాయి.

అయితే తాజాగా… ఆర్ఎన్ఏ (RNA) దాని చుట్టూ ఫ్యాట్ పొరను కలిగిన కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ళ ద్వారా ప్రవేశిస్తుంది. మనిషికి చేతి నుంచే వ్యాపిస్తుంది. దీంతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడంతో పాటుగా 75శాతం ఇథనాల్ మిశ్రమంగా ఉన్న శానిటైజర్‌ను ఉపయోగిస్తే చేతులపై ఉన్న కరోనా వైరస్ కనిపించకుండా శుభ్రం అవుతుంది.

ఇదే కాకుండా మరో ప్రతిపాదనను తీసుకొచ్చారు కేరళలోని పరిశోధకులు. కొన్ని (JAPI) వ్యాసాలను సైతం ప్రచూరించారు. కొబ్బరి నూనే కొంత వరకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భారత దేశంలో నాలుగు వేల సంవత్సరాల నుంచి కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారని.. ఆయూర్వేదంలో కొబ్బరి నూనెకు ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్ డీన్ డాక్టర్ జోషీ.