ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. ఈ రోజు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 1322 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే ఏడుగురు మృతి చెందారు. కోవిడ్ వల్ల శ్రీకాకుళంలో ఇద్దరు...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 1322 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే ఏడుగురు మృతి చెందారు. కోవిడ్ వల్ల శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపూర్‌లో ఒకరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, కృష్ణలో ఒకరు, వైజాగ్‌లో ఒకరు మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 239 మంది మృతి చెందారు. ఇందులో 10,860 యాక్టివ్ కేసులు ఉండగా, ఇక 8,920 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక సోమవారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 147, చిత్తూరు 120, ఈస్ట్ గోదావరి 171, గుంటూరు 197, కడప 96, కృష్ణ 55, కర్నూలు 136, నెల్లూరు 41, ప్రకాశం 38, శ్రీకాకుళం 36, విశాఖపట్నం 101, విజయనగరం 24, వెస్ట్ గోదావరిలో 106 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో ఏపీలో 16,712 సాంపిల్స్‌ని పరీక్షించగా 1263 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
#COVIDUpdates: 06/07/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,365 పాజిటివ్ కేసు లకు గాను *7252 మంది డిశ్చార్జ్ కాగా *239 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9874#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0xVb7XgnHP
— ArogyaAndhra (@ArogyaAndhra) July 6, 2020
Read More:
ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత