అర‌కులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

అర‌కులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు పరుస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో నేటి నుంచి అర‌కు వ్యాలీలో కూడా..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 07, 2020 | 9:31 AM

ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు పరుస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో నేటి నుంచి అర‌కు వ్యాలీలో కూడా సంపూర్ణ లాక్ డౌన్ విధించారు అధికారులు. రెండు వారాల పాటు ఈ లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతుంది. ఈరోజు నుంచి వ‌ర్త‌క‌, వాణిజ్యాలు అన్ని మూత‌పడబోతున్నాయి. ప్రైవేట్ హోట‌ళ్లు మూసేయాల‌ని నిర్ణ‌యించారు అధికారులు. అలాగే కేవ‌లం నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇచ్చారు. గ‌త వారంలో రెండు రోజుల చొప్పున లాక్‌డౌన్ విధిస్తూ వ‌స్తున్నా క‌రోనా కంట్రోల్ కాక‌పోవ‌డంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అర‌కు వ్యాలీలో రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు కాబోతుంది.

కాగా ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 72 మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,753కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,516 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,09,975కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu