మందుబాబులకు గుడ్ న్యూస్.. బార్లకు అనుమతి.. ఎక్కడంటే!
మందుబాబులకు అస్సాం ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ కారణంగా మూతపడిన బార్లను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
Assam govt allows bars to serve liquor: మందుబాబులకు అస్సాం ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ కారణంగా మూతపడిన బార్లను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు లైసెన్స్ కలిగిన బార్లకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా నిబంధనలకు లోబడి మద్యం సరఫరా చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే బార్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
కాగా, గతంలో అస్సాం రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం బార్లను మూసివేసింది. అయితే ఇప్పుడు విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లకు అనుమతులు ఇచ్చేందుకు సిద్దమైంది. ఇక అస్సాంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాటిన సంగతి తెలిసిందే.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!