నేడు విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలివే!

హైద‌రాబాద్‌లోని సుద‌ర్మ‌న్ న‌గ‌ర్ 11కేవీ విద్యుత్ ఫీడ‌ర్ ప‌రిధిలో అధికారులు చేప‌డుతున్న అత్య‌వ‌స‌ర మ‌ర‌మ్మ‌త్తుల కార‌ణంగా.. శుక్ర‌వారం విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో నేడు సుద‌ర్మ‌న్ న‌గ‌ర్‌లోని ప‌లు ప్రాంతాల్లో..

నేడు విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలివే!

హైద‌రాబాద్‌లోని సుద‌ర్మ‌న్ న‌గ‌ర్ 11కేవీ విద్యుత్ ఫీడ‌ర్ ప‌రిధిలో అధికారులు చేప‌డుతున్న అత్య‌వ‌స‌ర మ‌ర‌మ్మ‌త్తుల కార‌ణంగా.. శుక్ర‌వారం విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో నేడు సుద‌ర్మ‌న్ న‌గ‌ర్‌లోని ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది. డొయిన్స్ కాల‌నీ, సుద‌ర్మ‌న‌గ‌ర్ రోడ్‌నెంబ‌ర్ 1, 2, 3, 4, 5, 7, 8లో మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

అలాగే రాయ‌దుర్గం జేవీ కాల‌నీ 11 కేవీ విద్యుత్ ఫీడ‌ర్ ప‌రిధిలోని మ‌ర‌మ్మ‌త్తుల కార‌ణంగా.. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డ‌నుంది. కేంద్రీయవిహ‌ర్ ఫీడ‌ర్ ప‌రిధిలో మ‌ధ్యాహ్నం 12.15 నుంచి మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష్మీన‌గ‌ర్‌, వినాయ‌క్ న‌గ‌ర్‌, గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంద‌ని ఏడీఈ పేర్కొన్నారు.

Read More:

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం

Click on your DTH Provider to Add TV9 Telugu