కోషెర్ ఫార్మా కంపెనీ పేరుతో తిరుపతిరెడ్డి మోసాలు

కోషెర్ ఫార్మా కంపెనీ పేరుతో తిరుపతిరెడ్డి మోసాలు

తనకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని నమ్మబలికాడు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అంటూ ఊదరగొట్టాడు. ఫార్మా కంపెనీ స్థాపిస్తున్నా.. మీ సహకారం అవసరం అంటూ చాలా మందికి చేరువయ్యాడు. పార్ట్‌నర్‌గా ఉండమంటూ అనేక మందిని ఆహ్వానించాడు. అలా నమ్మి వచ్చిన వారి దగ్గర నుంచి కోట్లకు కోట్లు కాజేశాడు. చివరికి అతనో పెద్ద ఫ్రాడ్‌ అని తెలుసుకున్న వారంతా.. మోసపోయామని గ్రహించారు.

Balaraju Goud

|

Aug 07, 2020 | 11:16 AM

తనకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని నమ్మబలికాడు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అంటూ ఊదరగొట్టాడు. ఫార్మా కంపెనీ స్థాపిస్తున్నా.. మీ సహకారం అవసరం అంటూ చాలా మందికి చేరువయ్యాడు. పార్ట్‌నర్‌గా ఉండమంటూ అనేక మందిని ఆహ్వానించాడు. అలా నమ్మి వచ్చిన వారి దగ్గర నుంచి కోట్లకు కోట్లు కాజేశాడు. చివరికి అతనో పెద్ద ఫ్రాడ్‌ అని తెలుసుకున్న వారంతా.. మోసపోయామని గ్రహించారు.

సిద్దిపేట జిల్లా జగ్‌దేవ్‌పూర్‌లో తిరుపతిరెడ్డి ఓ ఫార్మా కంపెనీని స్థాపించాడు. అందుకోసం ఓ కన్సల్టెన్సీ సహాయం తీసుకుని అనుమతులు పొందడమే కాదు.. ఆ కంపెనీకి పంగనామాలు పెట్టాడు. అంతటితో అగకుండా రెండు కంపెనీలకు అనుమతి తీసుకుని ఒక్కటి ప్రారంభించినా.. ఏనాడూ దాన్ని కూడా సక్రమంగా నడిపిన దాఖలాలు లేదు. ఇదే క్రమంలో పరిచయం అయిన హైదరాబాద్‌, ముంబై ప్రాంతాలకు చెందిన వారిని నమ్మంచి కోట్లకు కోట్లు గుంజాడు. తన మాటలను నిజమని నమ్మేలా ఏకంగా ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు తనకు తెలుసంటూ ఒక్కొక్కరి పేర్లను చెబుతూ పోయాడు. అడిగితే కోట్లకు కోట్లు అయినా ఇస్తారని, కానీ అలా అడగడం ఇష్టం లేదని చెప్పేయత్నం చేశాడు. ముంబైకి చెందిన ఓ వ్యాపార వేత్తను కూడా డబ్బుల కోసం డిమాండ్‌ చేసిన ఫోన్‌ కన్వర్జేషన్‌ ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో అయ్యాగారి బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఫార్మా కంపెనీ స్థాపనలో తిరుపతిరెడ్డి నమ్మిన వారినే కాదు.. బ్యాంకులను కూడా మోసం చేసినట్టు తెలుస్తోంది. డమ్మీ ఆర్డర్లతో బ్యాంకుల నుంచి 60 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ఫార్మా కంపెనీలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములుగా ఉన్నారని చెప్పడం వల్లే చాలా మంది అతని మాటలను నమ్మినట్టుగా తెలుస్తోంది. తిరుపతి రెడ్డి బాధితుల్లో మాజీ మంత్రి కూతురు కూడా ఉన్నట్లు సమాచారం. తిరుపతిరెడ్డి మోసాల నేపథ్యంలో ఇటీవల అతని కంపెనీని అధికారులు మూసివేసినట్టుగా సమాచారం.

తిరుపతిరెడ్డి మాటలు నమ్మి ఇలా చాలా మందే డబ్బులు ఇచ్చారు. అలా ఇచ్చిన వారు మోసపోయామని తెలుసుకుని అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే తిరుపతిరెడ్డి కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే సడన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడంతో అతని గురించి తెలుసుకున్న పెట్టుబడిదారులు.. తిరుపతిరెడ్డిని పట్టుకుని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తీసుకున్న డబ్బులు తిరగి ఇవ్వాలని చితకబాదారు.

అయితే, తనపై దాడి చేశారంటూ తిరుపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుపతిరెడ్డి చేసిన మోసాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకుని మరింత లోతుగా విచారణ చెపట్టారు. ఐదేళ్ల క్రితం ఫార్మా కంపెనీ స్థాపనలో తిరుపతిరెడ్డి తనను నమ్మిన వారందరినీ మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందుకోసం అధికార పార్టీ నేతలను పేర్లను వాడుకోవడంతో పెట్టుబడులు పెట్టిన వారు ఎవరెవరున్నారని తెలుసుకునే యత్నం చేస్తూనే.. తిరుపతిరెడ్డి మోసాలపై మరింత ఆరా తీస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu