జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు ఏపీ సీఎం జగన్. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన తదితర పథకాల ద్వారా

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 10:43 AM

కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు ఏపీ సీఎం జగన్. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరుచుకోలేదు. కాగా.. అక్టోబర్‌ 15 నుంచి రాష్ట్రంలో కాలేజీలు పునఃప్రారంభమవుతాయని సీఎం ప్రకటించారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. బీటెక్ కోర్సుల్లో (నాలుగేళ్ల ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో) కూడా అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందని, ఈ నాలుగేళ్లలోనే 20 అదనపు క్రెడిట్స్‌ సాధించిన వారికి బీటెక్‌ ఆనర్స్‌ డిగ్రీ వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. విద్యార్థి అదే విభాగంలో ఈ క్రెడిట్స్‌ సాధిస్తే ఆనర్స్‌ అడ్వాన్స్‌డ్‌ అని వ్యవహరిస్తారు. వేరే విభాగంలో క్రెడిట్స్‌ సాధిస్తే ఆనర్స్‌ మైనర్‌ అని పేర్కొంటారు.