Covid Vaccination: విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొత్త టెన్షన్.. జూలై 1నుంచి విద్యాసంస్థలు షురూ.. క్లారిటీ లేని వ్యాక్సినేషన్!
కరోనా నియంత్రణకు టీకా ఉత్తమ మార్గమన్న నిపుణుల సూచనల మేరకు.. వ్యాక్సీన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
Students Waiting For Free Covid Vaccination: కరోనా నియంత్రణకు టీకా ఉత్తమ మార్గమన్న నిపుణుల సూచనల మేరకు.. వ్యాక్సీన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వాటిని అందించిన ప్రభుత్వం ఆతర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి అందించింది. క్రమంగా 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సీన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈనెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు ఎవరైనా సరే ఈ వ్యాక్సీన్ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కోట్లాదిమంది తమకు వ్యాక్సిన్ కోసం కొవిన్ యాప్ ద్వారా రిజిస్టార్ కూడా చేసుకున్నారు
ఈ నెల 21 నుండి దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ ఉంటుందని కేంద్రం ప్రకటంచింది. కానీ తెలంగాణాలో మాత్రం రెండు రోజులు గడుస్తున్న వాక్సిన్‌పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో జనం ఆందోళనలో ఉన్నారు. ఒక వైపు జూలై ఒకటవ తేదీ నుండి కాలేజీలు, స్కూల్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వాక్సిన్ పై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు పిల్లలు, వారి తల్లి తండ్రులు. అసలు ఎప్పటినుంచి ఇస్తారు అనేది క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం నుంచి అందరికీ టీకాలు వేస్తారని భావించి తెలియక కొందరు ప్రజలు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వాక్సిన్ లేదని తెలిసి వెనుదిరుగుతున్నరు.
జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ,ప్రైవేట్ ఉపాధ్యాయలు, లెక్చరర్ లకు అందరికీ టీకాలు ఇవ్వాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి జూన్ చివరినాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనుకుంటోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వాక్సినేషన్ మొదలు పెట్టింది ప్రభుత్వం. దాదాపు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న దాదాపు ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్స్, కాలేజ్ లో పని చేసే టీచర్స్, లెక్చరర్లు ఇప్పటి వరకు వాక్సిన్ తీసుకొని వారు ఈ ప్రత్యేక డ్రైవ్ లో పాల్గొని వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.
స్కూల్స్,కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీచింగ్ స్టాఫ్ కు వాక్సిన్ విషయంలో క్లారిటీ ఉన్నప్పటికి 18సంవత్సరాల పైబడిన వారికి వాక్సిన్ ఎప్పుడు అనేది తేలడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీకాల కొరత ఉందని దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఈ లెక్కన వచ్చే నెల 1వ తేదీ నుంచి మొదటి డోసు పంపిణీని పూర్తిగా నిలిపివేసే అవకాశాలున్నాయని వైద్య అధికారులు అంటున్నారు.
వచ్చే నెల రెండవ డోసు తీసుకునే వారి సంఖ్య దాదాపు 32లక్షల వరకు ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కేంద్రం నుండి వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన వాక్సిన్ డోసులు 21 లక్షలు మాత్రమే. వచ్చే డోసులు, ఉన్న నిల్వలు అన్ని కలిపిన కొత్త వారికి వాక్సిన్ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. మరి కాలేజీలు, స్కూల్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి ఎంటీ..? కొత్తగా వాక్సిన్ తీసుకునేందుకు వచ్చే వారి పరిస్థితి ఎంటీ ? అనేది క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది.