Brahmamgari Matam:ఎటూ తేలని బ్రహ్మంగారి మఠం వ్యవహారం.. ఇవాళ మంత్రి వెల్లంపల్లితో శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి భేటీ

కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రేగిన వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

Brahmamgari Matam:ఎటూ తేలని బ్రహ్మంగారి మఠం వ్యవహారం.. ఇవాళ మంత్రి వెల్లంపల్లితో శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి భేటీ
Shiva Swamy Meets Ap Minister Vellampalli Srinivas
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 22, 2021 | 1:24 PM

Pothuluri Veerabrahmendra Swamy Matam: కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రేగిన వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇవాళ శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి విషయంలో ప్రతిష్టంభనకు తెరదించాలని ఆయన సూచించారు. పీఠాధిపతి నియామకంపై పూర్తి స్ధాయి నివేదికను మంత్రికి అందచేశారు. 150 పేజీల నివేదికను మంత్రికి అందచేసినట్లు శివస్వామి తెలిపారు.

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో విశ్వ బ్రాహ్మణ సంఘాలు, పీఠాధిపతులు సూచనల మేరకు ఒక నిర్ణయానికి వచ్చామని శివస్వామి తెలిపారు. రెండుసార్లు బ్రహ్మం గారి మఠంలో పర్యటించామని, బ్రహ్మంగారి సజీవ సమాధి దగ్గర కూర్చొని స్థానికులతో చర్చించి నిర్ణయం తీసుకోమని సూచించామని తెలిపారు. పీఠాధిపతి విషయంలో సూదీర్ఘం చర్చించి 150 పేజీలు నివేదిక మంత్రికి అందచేసామని శివస్వామి తెలిపారు. త్వరలోనే ధార్మిక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బ్రహ్మంగారి మఠం విషయంలో అన్ని అంశాలను పరిగణంలోకి తీసుకున్నామని, కాలజ్ఞానంలో సూచించిన 325 వచనంలో రాసిన ఆధారాలు మంత్రి వెల్లంపల్లి దృష్టికి తీసుకువచ్చామన్నారు శివస్వామి. పెద్ద కుమారుడుకే ఇవ్వాలని మా నివేదిక ఇచ్చామన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరాము. కొత్త ఎన్నుకునే పీఠాధిపతిని మా డబ్బులతో అత్యంత వైభవంగా పట్టాభిషేకం చేయాలని పీఠాధిపతులు నిర్ణయించామని శివస్వామి తెలిపారు.

ఇదిలావుంటే, ఇటీవల శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇరువురు సంతానంతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చర్చలు జరిపి మూడు రోజులు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్రహ్మంగారి మఠానికి శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదని పేర్కొన్నారు. త్వరలోనే మఠాధిపతిని ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే, మూడు రోజుల్లో ఏ ఒక్కరు కూడా చర్చల కోసం కూర్చొని కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు. ఇచ్చిన మూడు రోజులు గడువు ముగియడంతో పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇక, ధార్మిక పరిషత్, దేవాదాయ శాఖ జోక్యం చేసుకోనున్నాయి.

దేవాదాయ శాఖకు, పీఠాధిపతుల బృందానికి సంబంధం లేదని మంత్రి వెల్లంపల్లి వివరించారు. దివంగత పీఠాధిపతి కుటుంబ సభ్యులు దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని కోరామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లితో శివస్వామి భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించింది.

Read Also…  Mudragada : క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు సమాజానికి సేవ చేసిన వారే.. అలా అవమానించొద్దు : సీఎంకు ముద్రగడ లేఖ