యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మహా దివ్యంగా రూపొందించే క్రమంలో సరికొత్త విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. దేవాలయం చుట్టూ మొత్తం 160 నూతన బ్యాలెట్ లైట్లను బిగించగా ఆ విద్యుత్ దీపాలను మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు యాడా అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక దీపాలంకరణతో యాదాద్రి క్షేత్రం ప్రధానాలయం గోల్డెన్ టెంపుల్ తరహాలో స్వర్ణ కాంతులు విరజిమ్ముతోంది.
1 / 7
యాదాద్రి ఆలయ సౌందర్యం అందరీ కళ్లను కట్టి పడేస్తోంది. శ్రీలక్ష్మీనరసింహుడి నేల నయన మనోహరంగా దర్శనమిస్తోంది. యాదాద్రిలో జరుగుతున్న ఆలయ జీర్ణోద్దరణ అద్భుత కళాఖండంగా అవతరిస్తోంది. ఆలయ శిల్పకళ మహాద్భుతంగా ఉన్నట్లు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.
భక్తి పారవశ్యం ఉప్పొంగేలా.. ఆగమశాస్త్రం ఉట్టిపడేలా.. యాదాద్రి నిర్మితమవుతున్న తీరు ఎంపీ సంతోష్ కుమార్‌ను ఎంతో పరవశింపచేసింది. రాత్రి వేళ సువర్ణశోభలో వెలిగిపోతున్న ఆ అపూర్వ నిర్మాణ అందాలను ఎంపీ సంతోష్ తన కెమెరాలో బంధించారు.
4 / 7
సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రికి వెళ్లిన ఎంపీ సంతోష్ అక్కడ తీసిన ఫోటోలను తన ట్వీట్టర్‌లో పోస్టు చేశారు.
5 / 7
వినీల ఆకాశం నుంచి చంద్రుడు యాదాద్రి ఆలయ గోపురాన్ని తిలకిస్తున్నట్లుగా ఎంపీ తీసిన ఫోటో అద్భుతంగా ఉంది.
6 / 7
ప్రాచీన, ఆధునిక పద్ధతుల్లో నిర్మితమవుతున్న యాదగిరి క్షేత్రం మునుముందు ప్రపంచం నలుదిశల నుంచి భక్తవత్సలుడి భక్తుల్ని రప్పిస్తుందని తన ట్వీట్‌లో ఎంపీ పేర్కొన్నారు.