వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ వలస కూలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.వలస కూలీలకు 15 రోజులపాటు ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్
Follow us

|

Updated on: May 17, 2020 | 9:28 AM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఊరు కానీ ఊరులో చిక్కుకుపోయి కడుపు నింపుకోవడానికి అవస్థలు పడుతున్నారు. కొందరు అయితే కాలినడకనే తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఇలా వెళ్ళుతున్నవారిని మృత్యువు కబలిస్తోంది కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. ఎక్కడోక చోటు దుర్ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వలస కూలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

వలస కూలీలకు 15 రోజులపాటు ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తమ స్వస్థలాలకు ఏపీ మీదగా నడుచుకుని వెళ్తున్న వలస కూలీలు ఎక్కడ కనిపించినా బస్సుల్లో ఎక్కించుకుని రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఎండలను కూడా లెక్క చేయకుండా తమ పిల్లలతో కలిసి నడిచి వెళ్తున్న వలస కూలీలను పరిస్థితిని చూసి సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం నడపబోతున్న ఆర్టీసీ బస్సుల్లో 15 రోజుల పాటు వలస కూలీలను ఉచితంగా తీసుకెళ్లాలని.. అంతేకాక వారికి మంచి నీరు, ఆహారం అందించే ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!