దేశంలో 90 వేలు దాటిన కరోనా కేసులు..

దేశంలో 90 వేలు దాటిన కరోనా కేసులు..

భార‌త్‌లో గడిచిన 24 గంటల్లో 4,987 కొత్త పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా, వైరస్‌ సోకి 120 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,927కి చేరింది.

Ravi Kiran

|

May 17, 2020 | 9:51 AM

భార‌త్‌లో గడిచిన 24 గంటల్లో 4,987 కొత్త పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా, వైరస్‌ సోకి 120 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,927కి చేరింది. ఇక ఇప్పటివరకు 34,109 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 2872 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 53,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విషయంలో ఇప్పటికే భారత్‌ చైనాను దాటిపోయింది.

ఇక దేశంలో మ‌హారాష్ట్ర అత్య‌ధిక కేసుల‌తో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్ రాష్ట్రాలు టాప్ 5 లిస్టులో ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి మహారాష్ట్రను క‌కావిక‌లం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 30,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,135 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,606 కరోనా కేసులు, 67 మరణాలు సంభవించాయి. అటు గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. అక్కడ 9,333 కేసులు నమోదు కాగా, 129 మంది వైరస్ కారణంగా మరణించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కోరలు చాస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 2,355 కేసులు నమోదు కాగా, 49 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. తెలంగాణలో 1509 కరోనా కేసులు, 34 మరణాలు సంభవించాయి.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu