కరోనా ఎఫెక్ట్ః 4 రోజులపాటు చెర్వుగట్టు ఆలయం మూసివేత
లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆలయాలకు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం మాత్రం నాలుగు రోజులపాటు మూతపడనుంది.
లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆలయాలకు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం మాత్రం నాలుగు రోజులపాటు మూతపడనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పోలీసు అధికారులు, ఆలయ నిర్వాహాకులు మీడియా సమావేశం ఏర్పాటు వివరాలు వెల్లడించారు.
ప్రతి ఆమావాస్య నాడు ఆలయ దర్శనానికి లక్ష మందికి పైగా భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న అమావాస్య వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల దర్శనాన్ని నిలువరించేందుకే ఆలయ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ నాలుగు రోజులు ఘాట్ రోడ్డుపై పోలీసు పహారా ఉంటుందని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ దర్శనానికి రావొద్దని సూచించారు. ఆ నాలుగు రోజులు ఇళ్లలోనే పూజలు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ నెల 22 తర్వాత భక్తులను ఆలయ దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. కాగా ఈ నాలుగు రోజులు ఆలయ పూజారులు యాధావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.