గుడ్‌న్యూస్‌.. డెక్సామెథాసోన్‌తో కరోనాకు చెక్..

యూకేకి చెందిన మీడియా మరో గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. కరోనా బారినపడ్డ వారిని కాపాడేందుకు మరో ఔషధం కూడా ఉపయోగించవచ్చని.. దీని ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న వారిని కూడా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చని పేర్కొంది.

గుడ్‌న్యూస్‌.. డెక్సామెథాసోన్‌తో కరోనాకు చెక్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 16, 2020 | 6:58 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్‌ల తయారీలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు.. అనేక దేశాలు వివిధ రకాల మందులను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనదేశం హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలతో పాటు.. ఇతర ఔషధాలను ఉపయోగిస్తూ కరోనా రోగుల్ని వైరస్‌ నుంచి బయటపడేస్తున్నారు డాక్టర్లు. అయితే మరికొన్ని దేశాలు ఇతర యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు ఇతర మరికొన్ని ఔషధాలను ఉపయోగిస్తూ.. కరోనా బారినపడ్డ రోగుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో యూకేకి చెందిన మీడియా మరో గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. కరోనా బారినపడ్డ వారిని కాపాడేందుకు మరో ఔషధం కూడా ఉపయోగించవచ్చని.. దీని ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న వారిని కూడా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చని పేర్కొంది. యూకే మీడియా తెలిపిన ప్రకారం.. డెక్సామెథాసోన్‌ (Dexamethasone) అనే ఔషధాన్ని ఉపయోగిస్తే.. వెంటిలేటర్‌పై ఉన్న రోగులు కూడా కరోనా నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. దాదాపు మూడోవంతు కరోనా రోగులు ఈ ఔషధాన్ని ఉపయయోగించడం ద్వారా బయటపడ్డారని ..కరోనాతో రిస్క్‌ స్టేజ్‌లో తాము కొందరికి ఈ ఔషధాన్ని ఉపయోగించామని.. వారంతా కరోనాను జయించి.. ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొంది.