రైతుల కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం..
అన్నదాతకు అడుగడునా గండలే. నారుపోసింది మొదలు, పంట చేతికి వచ్చేదాకా అన్ని కష్టాలే. అసలే అరకొర పంటలు, గిట్టుబాటులేని ధరలతో అలసిపోయిన అన్నదాతకు ఈ యేడు కరోనా మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో అన్నదాతను ఆదుకునేందుకు కేంద్రం మరో అడుగు ముందుకువేసింది. రైతులకు మేలు చేకూర్చేలా ధాన్యం కొనుగోళ్లపై పరిశ్రమలకు కీలక ఆదేశాలు జారీచేసింది. రైతులు పండించిన పంటల్లో ధాన్యం, త్వరగా పాడైపోయే ఉత్పత్తులను సేకరించేందుకు ముందుకు రావాలని పరిశ్రమల వర్గాలకు కేంద్ర ఫుడ్ […]

అన్నదాతకు అడుగడునా గండలే. నారుపోసింది మొదలు, పంట చేతికి వచ్చేదాకా అన్ని కష్టాలే. అసలే అరకొర పంటలు, గిట్టుబాటులేని ధరలతో అలసిపోయిన అన్నదాతకు ఈ యేడు కరోనా మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో అన్నదాతను ఆదుకునేందుకు కేంద్రం మరో అడుగు ముందుకువేసింది. రైతులకు మేలు చేకూర్చేలా ధాన్యం కొనుగోళ్లపై పరిశ్రమలకు కీలక ఆదేశాలు జారీచేసింది.
రైతులు పండించిన పంటల్లో ధాన్యం, త్వరగా పాడైపోయే ఉత్పత్తులను సేకరించేందుకు ముందుకు రావాలని పరిశ్రమల వర్గాలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖా మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ పిలుపునిచ్చారు. ఫిక్కీ, ఇతర ప్రముఖ పరిశ్రమల సభ్యులతో మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రస్తుత తీరుతెన్నులు, లాక్‌డౌన్ అనంతరం పరిశ్రమల అవసరాల గురించి చర్చించడానికి ఫిక్కీ సభ్యులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆమె అధ్యక్షత వహించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో పండించిన పంటలు, త్వరగా పాడైపోయే స్వభావం గల పంటల విషయంపై హర్‌సిమ్రత్ ప్రధానంగా చర్చించారు. గోధుమలు, వరి, పండ్లు, కూరగాయలు, ఇతర పాడైపోయే వస్తువులను సేకరించడానికి పరిశ్రమలు ముందుకు వచ్చి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ఫిక్కీ సభ్యులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిశ్రమల వర్గాలు కేంద్ర మంత్రికి వివరించాయి. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పరిశ్రమలకు అవసరమైన చర్యల కోసం సిఫారసులను ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లినట్టు వెల్లడించారు. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.