Black Fungus: బ్లాక్ ఫంగస్‌కు అదే కారణమా? అనుమానం వ్యక్తంచేస్తున్న వైద్య నిపుణులు

దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా...మరోవైపు  బ్లాక్‌ ఫంగస్‌,వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు దడ  పుట్టిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మన దేశంలో అత్యధికంగా ఎందుకు నమోదవుతున్నాయనే చర్చ జరుగుతోంది.

Black Fungus: బ్లాక్ ఫంగస్‌కు అదే కారణమా? అనుమానం వ్యక్తంచేస్తున్న వైద్య నిపుణులు
Black Fungus
Follow us
Janardhan Veluru

| Edited By: Team Veegam

Updated on: May 29, 2021 | 7:50 PM

దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా…మరోవైపు  బ్లాక్‌ ఫంగస్‌,వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు దడ  పుట్టిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మన దేశంలో అత్యధికంగా ఎందుకు నమోదవుతున్నాయనే చర్చ జరుగుతోంది. మే 28 నాటికి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో..12 వేల మందికి పైగా బ్లాక్‌ ఫంగస్‌ బారినపడినట్టు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మామూలు రోజుల్లో ఏడాదికి వంద కేసుల నమోదవుతాయంటున్న వైద్య నిపుణులు..కానీ కరోనాతో రోజుకు 700 పైగా కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.  ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్‌ పై దర్యాప్తునకు ఆదేశించింది కర్ణాటక సర్కారు. బ్లాక్ ఫంగస్ పేషంట్ల కేస్‌ హిస్టరీని వైద్యుల బృందంపరిశీలిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధికి కారణాలు ఏమై ఉండొచ్చని అధ్యయనం జరుపుతోంది. ఆక్సిజన్‌ సిలెండర్ల ద్వారా బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్లు డాక్టర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ…మే7, 2021న ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ మొదటి కేసు బయటపడింది. ఆ తర్వాత మహారాష్ట్రా,రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల జాబితాలో చేర్చాయి. మే 25నాటి వరకు దేశంలోనే అత్యధికంగా గుజరాత్‌లో 2,165 ,మహారాష్ట్రాలో 1188 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.  663 కేసులతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలుస్తుండగా… మధ్యప్రదేశ్‌‌లో 590, హర్యానాలో 339, ఏపీలో 248 మొత్తం 5,424 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,556 మంది కోవిడ్‌ వ్యాధి వచ్చిన వారు కాగా ..875 మంది కోవిడ్‌ వ్యాధికి గురికాని వారు ఉన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిన వారిలో 55 శాతం మంది డయాబెటిక్‌ వ్యాధి గ్రస్తులేనని కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు.

Black Fungus

Black Fungus

ఐఎంఏ డాక్టర్లు ఏమంటున్నారు… కోవాడ్‌ వ్యాధికి వాడుతున్న జింక్‌, ఐరన్‌ ఔషధాల వల్ల కూడా బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశాలున్నాయంటున్న ఐఎంఏ డాక్టర్లు

బ్లాక్ ఫంగస్‌కు కారణం ఇండస్ట్రియల్‌ ఆక్సిజనా?.. ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ సిలెండర్ల ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని కొందరు ముంబై డాక్టర్లు చెబుతున్నారు. నాణ్యతలేని ఆక్సిజన్‌ సిలెండర్ల ద్వారా బ్లాక్ ఫంగస్ సోకుతుందని బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రి స్కల్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ సంపత్‌ చంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అసుపత్రి ఐసీయూలో వుండే నాసిరకం పైపుల వల్ల కూడ వివిధ ఫంగస్‌లు సోకే ప్రమాదం ఉందని కూడా అనుమానం వ్యక్తంచేశారు. ఆక్సిజన్ అందించేప్పుడు ఫ్లో మీటర్ లో ఉపయోగించే నీరు దీనికి కారణం కావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తంచేస్తున్నారు.

మెడికల్‌ ఆక్సిజన్‌కు, ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌కు తేడా.. మెడికల్‌ ఆక్సిజన్‌కు లైఫ్‌ సేవింగ్‌ లక్షణాలు ఎక్కువ. మెడికల్‌ ఆక్సిజన్‌‌‌లో ఫంగస్‌ లేకుండా వివిధ చోట్ల ఫిల్టర్‌ చేస్తారు. అయితే ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ తయారీకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరు. శుభ్ర పరచని సిలెండర్ల నుంచి సరఫరా అయ్యే ఈ ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా..అందులోని మలినాలు కూడా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం పాలు చేసే అవకాశముంది. ఒక్కోసారి వాటిలో కలుషిత నీటిని వాడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆక్సిజన్‌ సిలెండర్లను పరిశుభ్రంగా కడగక పోవటం ద్వారా కూడా ఫంగస్‌ సోకే ప్రమాదం ఉందని ముంబై డాక్లర్ల అంచనావేస్తున్నారు. సిలిండర్లను ఖాళీ చేసి, పూర్తిగా శుభ్రం చేసి, తగిన విధంగా లేబుల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్  ఉపయోగించకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ సిలెండర్ల ను రవాణా చేసే సమయంలో లీక్‌ అవుతుంటాయి..దీని వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశాలుంటాయని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

Oxygen

Oxygen

మెడికల్‌ ఆక్సిజన్‌…ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌లో తేడాలు.. మెడికల్ అవసరాలకు స్వచ్చమైన ఆక్సిజన్‌నే ఉపయోగిస్తారు. పరిశ్రమల్లో తయారైయ్యే ఆక్సిజన్ 95 నుండి 99 శాతం పరిశుద్దతో ఉంటుంది. అందులో కొంత మలినాలతో కూడిన వాయువులు కూడా ఉంటాయి. మెడికల్ ఆక్సిజన్‌ను పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేస్తారు. దానిలో ఇతర వాయువులు ఏవీ ఉండవు. మనిషి శ్వాసించే వాయువులా మార్చడంతో దీనిని మెడికల్ ఆక్సిజన్ గా పిలుస్తారు. పరిశ్రమ అవసరాల కోసం తయారయ్యే ఆక్సిజన్‌ను ఇండస్ట్రీయల్ ఆక్సిజన్ గా పిలుస్తారు. దీనిని రోలింగ్ మిల్స్, ఫర్నేస్, స్టీల్‌ను వివిధ ఆకారాల్లో కట్ చేయడానికి, ఎస్ఎంఎస్ ప్లాంట్, లేజర్ సెట్టింగ్, వివిధ ప్రాసెసింగ్ వ్యవస్థల దగ్గర ఇగ్నిషియన్ కోసం వినియోగిస్తారు.

బ్లాక్ ఫంగస్‌ అంటే…? మ్యూకోర్‌మైసిస్.. దీన్నే జైకో‌మైకోసిస్, బ్లాక్ ఫంగస్‌గా పిలుస్తారు. ఇది కొత్త కాదు. వాతావరణంలో సహజంగానే ఉంటుంది. మనుషులకు చాలా అరుదుగా సోకుతుంది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ ఫంగస్ ఒక రకమైన బూజు. గాలి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్లి సైనస్, ఊపిరితిత్తుల్లో చేరుతాయి. శరీరానికి అయిన గాయాల ద్వారా కూడా లోపలికి వెళ్లవచ్చు. మ్యూకోరో‌మైసిస్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకితే కంటి చూపుపోవచ్చు..ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశాలున్నాయి. బ్లాక్ ఫంగల్ కేసుల్లో 50శాతం మరణాల రేటు నమోదవుతోంది. మూడో వంతు మంది కంటి చూపు కోల్పోతున్నారు. ముందుగానే గుర్తించి యాంటీఫంగల్‌ వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చుని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

ఉత్తర ప్రదేశ్‌లో జోరుగా కల్తీ మద్యం.. 35కు చేరిన మృతుల సంఖ్య.. మరో 14 మంది పరిస్థితి విషమం..!

నాసల్ స్ప్రేతో కోవిద్ వైరస్ మాయం…కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ బయోటెక్ సంస్థ ప్రకటన

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!