Coronavirus: శ్రీచైతన్య విద్యాసంస్థలో కరోనా కలకలం..60మందికి పాజిటివ్.. అప్పటివరకు క్లోజ్

పాఠశాలల్లో కరోనా వ్యాప్తి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. తాజాగా శ్రీచైతన్య విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. 

Coronavirus: శ్రీచైతన్య విద్యాసంస్థలో కరోనా కలకలం..60మందికి పాజిటివ్.. అప్పటివరకు క్లోజ్
Students Corona Positive
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 29, 2021 | 11:34 AM

బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.  దీంతో విద్యాసంస్థను అక్టోబర్​ 20 వరకు మూసివేసింది యాజమాన్యం. మొత్తం 480 మందికి టెస్టులు చేయగా.. 60 మందికి కొవిడ్​ పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు అర్బన్​​ డిప్యూటీ కమిషనర్​ మంజునాథ్​ తెలిపారు. అయితే.. పాజిటివ్​గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు ఉన్నాయని, భయపడాల్సిందేమీ లేదని వివరించారు. వైరస్ సోకిన విద్యార్థుల్లో 46 మంది కర్ణాటక వాసులు కాగా.. మిగిలిన 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన క్రమంలో నెలరోజుల క్రితం శ్రీచైతన్య రెసిడెన్సియల్​ స్కూల్‌ను పునఃప్రారంభించారు.

భయపెడుతున్న మిస్క్‌

కరోనా సోకి నయమైన పిల్లలకు మిస్క్‌ (మల్టిపుల్‌ సిస్టం ఇన్‌ఫ్లమ్మేషన్‌ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌) అనే డిసీజ్ సోకుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో సాధారణంగా సంభవించే జ్వరాలు వంటి సింటమ్స్‌తోనే కరోనా బారిన పడుతున్నారు. పోస్ట్‌ కొవిడ్‌ సింటమ్స్ ప్రస్తుతం సవాలుగా మారాయి. ఏడాదిన్నర కాలంలో 300 మందికిపైగా చిన్నారులకు రాష్ట్రంలో ఈ వ్యాధి సోకగా… ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు విడిచారు. పిల్లలు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తల్లిదండ్రులు ఆరునెలల పాటు అత్యంత జాగ్రత్తగా చూసుకోవడం తప్పనిసరి అని డాక్టర్లు సూచిస్తున్నారు.

Also Read: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్

నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం