లాక్‌డౌన్ ఎఫెక్ట్ః నాలుగు గంటలే బ్యాంక్ సేవలు
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. పనిగంటల్ని తగ్గించాయి. ఇకపై కేవలం...
కోవిడ్-19: వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు అతలాకుతలం అవుతున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తోన్న వైరస్ కారణంగా దేశంలో చాలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటు కల్పించాయి. తప్పనిసరి సేవలు మాత్రం అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటాయి. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. పనిగంటల్ని తగ్గించాయి. ఇకపై కేవలం నాలుగు గంటలే పనిచేస్తాయని ప్రకటించాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సహా పలు బ్యాంకులు తమ సిబ్బంది ఆర్యోగం నిమిత్తం… పని గంటలను మార్చాయి. సాధారణంగా బ్యాంకులు ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. కానీ ఇక నుంచి బ్యాంకింగ్ సేవలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని స్పష్టం చేశారు.
ఈనెల 31 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయని ప్రకటించాయి. ఈనెల 31 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్ అధికారులు తెలిపారు. కస్టమర్లు కూడా కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాంకు సేవల్లో చేస్తున్న మార్పులకు సహకరించాలని కోరుతున్నాయి. ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ఖాతాదారులను కోరుతున్నాయి. బ్యాంకులు డ్యూటీలో ఉన్న సిబ్బందిని కూడా తగ్గిస్తున్నాయి. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుండడం ఇందుకు ప్రధాన కారణమని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.