అదుపుతప్పితే అంతే సంగతులు..
కరోనా వైరస్ వ్యాప్తిపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి స్పందించారు. దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోందని.. పరిస్థితి ఆందోళనకరంగా మారిందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. మనం ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి చాలా దేశాలకన్నా వైద్యపరంగా అభివృద్ధి చెందిన వాళ్లం కాదని.. వారి అజాగ్రత్త వల్ల.. తక్కువ జనాభా ఉన్న దేశాలే కరోనా బారినపడి […]
కరోనా వైరస్ వ్యాప్తిపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి స్పందించారు. దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోందని.. పరిస్థితి ఆందోళనకరంగా మారిందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.
మనం ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి చాలా దేశాలకన్నా వైద్యపరంగా అభివృద్ధి చెందిన వాళ్లం కాదని.. వారి అజాగ్రత్త వల్ల.. తక్కువ జనాభా ఉన్న దేశాలే కరోనా బారినపడి అతలాకుతలమవుతున్నాయన్నారు. అలాంటిది మనదేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పితే.. అప్పుడు ఆపగలిగే పరిస్థితులు మనదగ్గర లేవన్నారు. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కర్ఫ్యూ విధించిందో ఆలోచించాలన్నారు. మన రాష్ట్రాలలో కూడా అంతకంతకు తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికే సంఖ్య 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడం ప్రస్తుత పరిస్థితిని ఎంతో ఆందోళనకరంగా మార్చిందని.. ఇప్పుడే ప్రజలంతా ఆలోచించి.. వివేకంతో వ్యవహరించాలని తన పోస్ట్‌లో సందేశాన్ని తెలిపారు.